Telugu Health tips



తియ్యని చెరకు అంటే నచ్చనిది ఎవరికి? వేడిని తగ్గించే ఈ పానీయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా?
రీరంలో వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించకపోతే చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతాయి. ఇది అధికబరువుకి కారణం కావడమే కాదు దీనివల్ల అనేక అనారోగ్యాలూ చుట్టుముడతాయి. ఆ కొవ్వుని కరిగించడంలో చెరకు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. జీవక్రియ రేటు మెరుగుపడేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచాలనుకునేవారు చెరకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఎండలో అలసిపోయి తిరిగివచ్చాక ఒక్కగ్లాసు చెరకు రసాన్ని తాగితే చాలు తక్షణ శక్తి అందుతుంది. దీనిలో లభించే జింక్‌, క్రోమియం, కోబాల్ట్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లూ, ప్రొటీన్‌లూ, ఫైటోన్యూట్రియంట్‌లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడతాయి.
చెరకులో ఇనుముతో పాటు ఫోలేట్‌ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. హిమోగ్లోబిన్‌ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులోని లోపాలను అరికట్టవచ్చు.
పెరుగు తింటున్నారా!
చాలామంది అమ్మాయిలు పాలే కాదు.. పెరుగు కూడా తీసుకోరు. తింటే లావైపోతామేమో అని భయపడటమే కారణం. కానీ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలు ఎన్నో తెలుసా..
పెరుగులోని పోషకాల్ని జీర్ణవ్యవస్థ సులువుగా స్వీకరిస్తుంది. దీన్ని మసాలాపదార్థాలతో కలిపి తీసుకుంటే గనుక ఆ ఘాటు తగ్గి.. హాయిగా అనిపిస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది యుక్తవయసులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ పెరుగు తీసుకోవాల్సిందే. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికరక్తపోటు కూడా అదుపులో ఉండి, చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధకశక్తిని పెంచి, హానిచేసే సూక్ష్మక్రిముల్ని నశింపచేస్తుంది. జననేంద్రియ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
పెద్దయ్యేకొద్దీ ఆస్టియోపోరోసిస్‌ వచ్చే సమస్య మహిళల్లో ఎక్కువ అంటారు. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ముందునుంచీ పెరుగు తినడం మంచిది. ఇది ఎముకలకు మేలుచేసి.. ఆ సమస్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పాలల్లోలా ఇందులోనూ పాస్ఫరస్‌, క్యాల్షియం పోషకాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
పెరుగులో జింక్‌, విటమిన్‌ ఇ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగు రోజూ తినడం వల్ల చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది. బరువునూ అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
పెరుగు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని భయపడేవారు ఓ పనిచేయొచ్చు. వెన్నలేని పాలతో తోడుబెట్టిన పెరుగును ఎంచుకోవచ్చు. దానివల్ల కెలొరీల భయం ఉండదు.. పోషకాలూ అందుకోవచ్చు.

పరుగు ఒక్కటే చాలు..
బరువు తగ్గాలన్నా కండరాలు దృఢంగా మారాలన్నా.. కెలొరీలు కరగాలన్నా పరుగుతోనే సాధ్యం. అసలు దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలొరీలు కరిగిపోతాయి. దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
మెల్లిగా పరుగెత్తడంతో పోలిస్తే వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. పరుగు ప్రారంభించాలనుకునేవారు వారు వేసుకునే బూట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు సరిపోయే వాటినే ఎంచుకోవాలి. లేదా పరుగెడుతున్నప్పుడు గాయాలవుతాయి. దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి కంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
పరుగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
ఆరోగ్యానికి ఇకనుంచయినా..
అమ్మకు ఒంట్లో బాగోకపోతే ఇంటిల్లిపాదీ ఇబ్బంది పడాల్సిందే! అన్నీతానై వ్యవహరించే అమ్మ అంటే అంతేమరి. మీరూ అటువంటి అమ్మే అయితే... మీ రోగనిరోధకశక్తి గురించి కాస్త ఆలోచించుకోండి.. అందుకు కావాల్సిన ఆహారం గురించి తెలుసుకోండి.
విటమిన్‌ డి: ఇది ఎముక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని తీసుకోకపోతే ఎముకలు గుల్లబారిపోవడం, మధుమేహం, హృద్రోగాలూ, క్యాన్సర్ల వంటి సమస్యలు బాధిస్తాయి. అందుకే ఉదయం, సాయంత్రం ఎండలో కాసేపు గడపాలి. ఆహార పరంగా పుట్టగొడుగులు, గుడ్లు, చేపలు అధికంగా తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తే రోగనిరోధక సమస్యలు దరిచేరవు. అలానే వెల్లుల్లిని కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది.
గ్రీన్‌ టీ: యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభించే గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి... పలు అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. దీన్ని ఫలానా సమయంలోనే తాగాలని లేదు. రోజుకు రెండుమూడు కప్పులు తాగినా మంచిదే.
యాంటీఆక్సిడెంట్లు: శరీరానికి యాంటీఆక్సిడెంట్లు ఎంత అందితే అంత మంచిది. ఇవి పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, యాపిల్‌ వంటి వాటిలో అధికంగా ఉంటాయి. ఇవి నిత్యం తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తే పలు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి.
విశ్రాంతి: ఎన్ని పనులు ఉన్నప్పటికీ తగిన విశ్రాంతి చాలా అవసరం. సమయం దొరికితే ఇంకా ఏదో చేసేద్దాం అనుకోకండి. కంటి నిండా నిద్ర ఉంటే జీవక్రియ రేటు బాగుంటుంది. అనారోగ్యాలు దరిచేరవు. ఒత్తిడి కూడా దూరమవుతుంది. కాబట్టి వేళకు నిద్రపోయేలా చూసుకోండి. అలాగే ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
తినే ముందు ఒక్కక్షణం!
ఒక్క మిల్క్‌షేకే కదా తాగితే ఏమవుతుంది! కాసిని చిప్సే కదా! ఒక్కరోజుకు తినేయొచ్చు.. ఇలాగే ఆలోచిస్తాం చాలాసార్లు. కానీ ఇలాంటివి తినేముందు అవి అందించే కొవ్వుని కరిగించుకోవాలంటే ఎంతెంత వ్యాయామం చేయాలో చూద్దాం...
క మిల్క్‌షేక్‌ తాగితే కనీసం గంటపాటూ తాడాట ఆడాలి. అప్పుడే ఆ కెలొరీలు ఖర్చవుతాయి. ఒక మిల్క్‌షేక్‌లో సగటున 786 కెలొరీలు ఉంటాయి మరి.
చీజ్‌కేక్‌లో ఒక్కముక్క తిన్నా సరే రోజులో కనీసం రెండు గంటలు నడిస్తే కానీ ఆ కెలొరీలు ఖర్చుకావు
వేయించిన చికెన్‌ ఫ్రైని కడుపునిండా తినేశారా? అయితే గంటపాటు సైకిలు తొక్కాల్సిందే. అంతసేపు సైకిలు తొక్కితే కానీ.. ఆ కెలొరీలు ఖర్చుకావు.
చిప్స్‌ ప్యాకెట్‌ మొత్తం ఒక్కరే లాగించేశారా? వాటి తాలూకు కొవ్వు కరిగించుకోవాలంటే రెండు గంటలపాటూ ఈతకొట్టాల్సిందే. ఈ చిప్స్‌ ప్యాకెట్‌లో కనీసం 700 కెలొరీలు ఉంటాయి.
రెండు ముక్కల చీజ్‌బర్గర్‌ని తింటే 88 నిమిషాల పాటూ పొత్తికడుపునకు సంబంధించిన వ్యాయామాలు చేయాల్సిందే.
ఉత్తి సోడానే కదా ఇందులో ఏముంటుంది అనుకోవద్దు. చక్కెర ఉన్నా లేకపోయినా సీసా సోడా తాగితే 54 నిమిషాల పాటూ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. మామూలు సోడాలో కూడా 200 కెలొరీలు ఉండటమే అందుకు కారణం.
పోషకాల మిరియాలు
జలుబు చేసినప్పుడో, గొంతు గరగర ఉన్నప్పుడో తప్ప మిరియాల్ని పెద్దగా వాడరు కొందరు. కానీ వాటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే గనుక ఎన్నోరకాల లాభాలున్నాయి. ఇంతకీ అవేంటంటే..
మిరియాల్లో ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్‌, జింక్‌, క్రోమియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా విటమిన్‌-ఎ, సి కూడా వీటి నుంచి సమృద్ధిగా పొందవచ్చు. మిరియాలు వంటలకు సువాసనను ఇవ్వడమే కాదు, కొన్ని రకాల అనారోగ్యాలు కూడా రాకుండా నిరోధిస్తాయి.
మిరియాల్లో ఉండే పైపరిన్‌ అనే పదార్థం రొమ్ము క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలోని ఎ, సి విటమిన్లు, ఫ్లవనాయిడ్లు, కెరొటిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మనకు హానీ చేసే ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీర కణాలను కాపాడతాయి. వంటల్లో మిరియాల పొడిని వాడటం ద్వారా క్యాన్సర్‌ కణాలు శరీరంలో చేరవని అధ్యయనాలు తేల్చాయి.
పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలోనూ ఇవి కీలకంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ పని తీరును వేగవంతం చేస్తాయి.
మిరియాల్లో ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు కణాలను విడగొట్టి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. తీసుకున్న పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో మిరియాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ చర్మాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మచ్చలను పోగొడతాయి.
మిరియాలు మెదడులోని చర్యలను వేగవంతం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.
అధిగమిద్దాం ఇనుము లోపం!
ఇనుము లోపం కొందరిలో చిన్నవయసు నుంచీ ఉండొచ్చు. దానికోసం ప్రత్యేకంగా సప్లిమెంట్లు వేసుకోవడం కాకుండా అవి లభించే పదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం మంచిది. అవేంటంటే..
పాలకూర: ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. మూడు కప్పుల పాలకూర ఒక రోజులో తీసుకుంటే దాని ద్వారా పద్దెనిమిది మిల్లీగ్రాముల ఇనుము అందుతుంది. అంతేకాదు నిత్యం పాలకూరతో చేసిన పదార్థాలు, సలాడ్‌ తినేలా ప్రణాళిక వేసుకుంటే మంచిది.
ఎర్ర కందిపప్పు: దీనిలోనూ పీచు, పొటాషియం, మాంసకృత్తులు, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక కప్పు పప్పు ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఇనుము లోపం ఉండదు. రక్తహీనత కూడా బాధించదు. ముఖ్యంగా గర్భిణులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంలో పప్పు ఉండేలా చూసుకుంటే గర్భస్థ శిశివు ఎదుగుదలకు చాలా మేలు జరుగుతుంది.
బంగాళాదుంప: ఒక బంగాళాదుంపను బేక్‌ చేసి తీసుకుంటే ఇనుము చక్కగా అందుతుంది. అదే పరిమాణంలో చికెన్‌ తీసుకున్నా అంత ఇనుము అందకపోవచ్చు.
నువ్వులు: ఒక చెంచా నువ్వుల్లో 1.4 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. వీటిని పొడిలా చేయడం లేదంటే నువ్వులతో ఏదైనా వంటకం చేసి తరచూ తీసుకుంటే ఆ పోషకం శరీరానికి సమృద్ధిగా అందుతుంది. గర్భిణులు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవాలి. అప్పుడే నెలసరులు మొదలైన అమ్మాయిలు ఎక్కువగా తింటే బలహీనంగా మారకుండా ఉంటారు.
జీడిపప్పు: పావుకప్పు జీడిపప్పులో రెండు గ్రాముల ఇనుము ఉంటుంది. అలానే ఇందులో మాంసకృత్తులు కూడా బాగానే లభిస్తాయి. ఇది కూడా ఇనుము లోపాన్ని అధిగమించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
సోయా బీన్స్‌: ప్రతిరోజూ ఉడికించిన సోయా ఒక కప్పు తీసుకుంటే రక్తహీనత సమస్య ఉండదు. ఇనుములోపం కూడా దూరమవుతుంది. కప్పు సోయా ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది మిల్లీ గ్రాముల ఇనుము అందుతుంది.



వేపగింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు


వేపాకులోని ఔషధగుణాలు గురించి మనకందరికీ తెలిసినవే. కొన్ని వేల సంవత్సరాల నుండి వేపాకును వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఒక వేప ఆకులోనే కాకుండా, వేప గింజలు, నూనె, బెరుడు ఇలా వేపలో ఔషధపరంగా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అన్నిరకాల జీర్ణ సమస్యల్ని, చర్మ, మరెన్నో ఆరోగ్యపరమైన సమస్యల్ని నివారించడంలో వేపగింజలు గొప్పగా సహాయపడతాయి. ఈ వేప గింజలను అప్పుడప్పుడు ఏదో రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. వేపతో మొటిమలు, మచ్చలు లేని కాంతివంతమైన చర్మసౌందర్యం పొందవచ్చు. వేపగింజలను పొడిచేసి వేడి పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కళ్ళు, చెవుల ఇన్ఫెక్షన్లు నివారించడంలో వేపగింజలతో తయారుచేసిన నూనెను ఉపయోగిస్తారు. వేపగింజల్లో ఔషధగుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది సురక్షితమైనది. మలేరియాకు కారణమయ్యే దోమలున్న ప్రదేశంలో వేపగింజల పొడి చల్లడం వల్ల దోమగుడ్లు నాశనమవుతాయి. తరచూ అనారోగ్యానికి గురయ్యే వారికి వేపగింజల పొడి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఆటలమ్మ, పొంగు, తట్టు (మీజిల్స్‌) వల్ల కోల్పోయిన శక్తిని అందివ్వడంలో, వ్యాధి నిరోధకతశక్తిని పెంపొందించడంలో వేపగింజలు సహాయపడుతాయి. వేపగింజలు బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. ముఖ్యంగా మొటిమలు, ముఖంపై మచ్చలు, కడుపులో అల్సర్‌ వంటి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.


అరటితో ఆరోగ్యానికి మేలు!

                




ఇటాలియన్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజూ మూడు అరటి పండ్లను తినేవారిలో హృద్రోగ సమస్యలు తగ్గుముఖం పట్టాయని తెలిసింది. రోజూ ఉదయం అల్పాహారం అయ్యాక, మధ్యాహ్నం భోజనానంతరం, రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడు అరటి పండ్లు తినడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించుకోవచ్చు. మెదడు, రక్త సంబంధింత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. నట్స్‌, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారం తీసుకోవడం కంటే ఈ పద్ధతి పాటిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే గుండెపోటు, రక్తపోటు, వంటివాటిని చాలా వరకు తగ్గించుకోవచ్చుని తెలిపారు. శరీరంలో పొటాషియం శాతం తగ్గించి, గుండెపోటును నియంత్రించుకునేందుకు అరటి పండ్లు మంచి మార్గం అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

వద్దు....వద్దు!


ఆయుర్వేదంలో ఇస్తున్న సూచనలు ఇవి..
- చల్లని నీటితో మందులు వేసుకోవద్దు
- సాయంత్రం అయిదు దాటాక ఎక్కువ మొత్తంలో
ఆహారం తీసుకోవద్దు.
- ఉదయంపూట ఎక్కువ నీటిని తాగి సాయంత్రానికి తగ్గించాలి.
- రాత్రి పది నుండి తెల్లారి నాలుగు వరకు చక్కని
నిద్ర సమయం.
- భోజనం చేయగానే నిద్రపోవద్దు
- ఫోన్‌ని ఎడమ చెవి నుండి మాట్లాడండి.
- ఫోన్లు ఛార్జింగ్‌ చివరి పాయింట్‌కి వచ్చినపుడు మాట్లాడవద్దు. ఆ సమయంలో రేడియేషన్‌ వెయ్యిరెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఆహారమే...పరిష్కారం!


- ఓట్‌మీల్‌ యాంగ్జయిటీని తట్టుకుని నివారిస్తుంది.
- డార్క్‌ చాక్‌లెట్‌ స్ట్రెస్‌ హార్మోన్లను తగ్గిస్తుంది.
- ఒక గ్లాసు గోరువెచ్చని పాలు ఆందోళనను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తాయి.
- ఆరంజ్‌లోని విటమిన్‌ సి స్ట్రెస్‌ విరుగుడుగా పనిచేస్తుంది.
- నల్ల ద్రాక్ష ఒత్తిడికి చెక్‌ పెడుతుంది.
- అరటి పండు ఆందోళనను ఆపుతుంది
- వెల్లుల్లి, క్యాబేజి, గింజలు, యాపిల్స్‌ సైతం ఒత్తిడిని తగ్గిస్తాయి.
- ఒత్తిడి తలనొప్పులు ఉన్నపుడు గ్రీన్‌ యాపిల్‌ వాసన చూస్తే ఉపశమనంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీలో ఉన్న థెనైన్‌ అనే అమినో ఆసిడ్‌ చిరాకు తగ్గించి ఏకాగ్రత పెంచుతుంది.
- మనసు బాగోని సందర్భాల్లో పచ్చి కొబ్బరి వాసన చూస్తే ప్రశాంతంగా ఉంటుందని, హార్ట్‌ బీట్‌ చక్కబడుతుందని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.


కాంటాక్ట్లెన్స్వల్ల దుష్ప్రభావాలు

Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description: కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల  దుష్ప్రభావాలు
                   నేటి మోడ్రన్ ప్రపంచంలో కళ్ళద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్ వినియోగం ఎక్కువయింది. కంటిచూపును మెరుగు పరుచుకోవడానికి, అందంగా కనబడటానికి వీటిని వాడుతున్నారు. అయితే కాంటాక్స్ లెన్స్ వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అవకాశం ఉన్నంతవరకూ వాటిని తక్కువగా ఉపయోగించాలని అంటున్నారు. వాటిని రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎక్కువ కాలం కాంటాక్ట్ లెన్స్ దరించడం వల్ల కళ్ళలోని కార్నియా దెబ్బతింటుందని నిపుణుల అభిప్రాయం. వీటిని అమర్చేటప్పుడు చేతివేళ్ళను ఉపయోగిస్తాం. అందువల్ల చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. పొగతాగేవారు కాంటాక్ట్ లెన్స్కు దూరంగా ఉండాలి. స్మోకర్స్లో కార్నియల్ అల్సర్ సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు నిర్ధారించారు. లెన్స్ కళ్ళను బ్లాక్ చేయడం వల్ల ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. అందువల్ల కళ్ళు పూర్తిగా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
లివర్లవర్‌...జీలకర్ర!

Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description: లివర్‌ లవర్‌...జీలకర్ర!
                 వంటల్లో విరివిగా వాడే జీలకర్రలో ఔషధ గుణాలు ఎక్కువే. ఇది జీర్ణ సమస్యల పరిష్కారానికి పెట్టింది పేరు. అలాగే యాంటీసెప్టిక్గానూ పనిచేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వలన లివర్కి బలం చేకూరుతుంది. అజీర్తి, తలతిరుగుడు, విరేచినాలు, వాంతులు వీటన్నింటి నుండి జీలకర్ర ఉపశమనం ఇస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను జీలకర్ర కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను కొత్తిమీర రసం వేసి మరిగిస్తే జీలకర్ర టీ తయారవుతుంది. దీన్ని ఉదయం పూట సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. బాగా జలుబుచేసి గొంతునొప్పిగా ఉన్నపుడు శొంఠి, జీలకర్ర పొడులను కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర రసం రెగ్యులర్గా తాగుతుంటే శరీరంలో వేడి పెరిగి మెటబాలిజం రేటు పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కిడ్నీ, లివర్ జబ్బులు రాకుండా నివారిస్తుంది. నల్ల జీలకర్రతో ఆస్తమా, ఆర్తరైటిస్లను నివారించవచ్చని చెబుతారు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నందున నల్ల జీలకర్ర, నీళ్లు కలిపి చేసిన పేస్ట్ని కాలిన గాయాలు, పుళ్లమీద అప్లయి చేస్తే మానుడు పడతాయి.

ఆరోగ్య రక్ష...తులసి!


                    రోజూ పెరట్లో కనిపించే తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు మొదలైనవాటిని నివారించేందుకు తులసి ఆకులు సహాయపడతాయి. రింగ్‌వార్మ్‌లాంటి చర్మసంబంధ వ్యాధులకు తులసి ఆకుల రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. తలనొప్పికి కూడా తులసి మంచి ఔషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులను డికాక్షన్‌గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు. అంతేకాదు ఈ ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా కూడా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల నోటిదుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చుతుంది. గంధం అరగదీసి అందులో తులసి ఆకులను కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిమీద రాసుకుంటే వేడివల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసి, ఎంతో చల్లదనం లభిస్తుంది. తులసి ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల గొంతులో కలిగే ఇబ్బందులను దూరం చేయొచ్చు.

కళ్లలో రక్తపు జీరలు



కళ్లలో రక్తపు జీరలు
మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడుతాం. 
కళ్లలో రక్తపు జీరలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. కనుక ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట ఈ లక్షణమే. 
వయస్సు పెరుగు తున్న కొద్దీ కళ్లు స్వచ్ఛమైన తెలుపును కోల్పోయి క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. 
కోపం, ఉక్రోషం, తమకం వంటి అనేకానేక భావాలు కళ్లలో రక్తపుజీరలుగా ప్రతిఫలిస్తాయి. 
అలాగే అనేకానేక వ్యాధులు, పరిస్థితులు కళ్లను ఎర్రగా కనిపించేలా చేస్తాయి. 
కళ్లలో ఎరుపుదనం కనిపించే విధానాన్నిబట్టి సమస్య ఏమిటనేది కొంత వరకూ ఊహించవచ్చు. 
ఉదాహరణకు కనురెప్పల కింద రక్తనాళాలు వాచి స్రావయుక్తంగా ఉంటే నేత్రాభిష్యందం (కంజెం క్టివైటిస్‌) వంటి ఇన్‌ఫెక్షన్లకూ, ఇన్‌ఫ్లమేషన్లకూ సూచన. అలా కాకుండా, కంటిలోని కృష్ణ పటలం (ఐరిస్‌) చుట్టూ రక్తనాళాలు ఉబ్బిపోయి, నొప్పిని, దృష్టి సమస్యలను కలిగిస్తుంటే కంటిపైన పారద ర్శకంగా ఉండే కార్నియా పొరకు ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చినట్లుగా లేదా కంటిలోపలి నిర్మాణాలు వ్యాధిగ్రస్తమైనట్లుగా అర్థం చేసుకోవాలి. 
కంటి ఎరుపుదనానికి, రక్తపు జీరలకు వెనుక ఉన్న ఇలాంటి ఆకరణాలను శోధిం చేందుకు ఈ కింది ప్రశ్నలు తోడ్పడుతాయి. కన్ను అంతా ఎర్రగా కనిపిం చడంతోపాటు కనురెప్పను లాగి దాని కింద చూస్తే ఒకవేళ మరింత ఎర్రగా కనిపిస్తే అది నేత్రాభిష్యందానికి సూచన. ఎలర్జీ, ఇన్‌ఫెక్షన్లు నేత్రాభి ష్యందాన్ని కలిగిస్తాయి. 
చీము, స్రావాలు ప్రధానంగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ గానూ, కేవలం దుర, మెరమెరలాడటం ఉంటే ఎలర్జీగానూ అర్థం చేసుకో వాలి. నేత్రాభిష్యందం ఉన్నప్పుడు తలారాస్నానం చేయడం, తాంబూలం సేవించడం నిషిద్ధం. ఉదయంపూట జలనేతి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగడం చేయాలి. అప్పుడే తీసిన వెన్న కంటికి చాలా మంచిది. త్రిఫలాలు, అభ్రకభస్మం, స్వార్ణమాక్టీక భస్మాలను తేనెతో కలిపి తీసుకుంటే అన్ని రకాల నేత్రాభిష్యందాలు తగ్గుతాయి. బాహ్యప్రయోగంగా ఆయుర్వేదంలో సేకం, ఆశ్చ్యోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అనే క్రియా కల్పాలు ఉన్నా యి. 
వీటిని అవసరానుసారం చేయాలి. కంటిపైన పలుచగా, పారదర్శకంగా పరుచుకుని ఉండే కంజెంక్టైవా పొర కింద రక్తస్రావం జరిగితే (సబ్‌ కంజె క్టౖవల్‌ హెమరేజ్‌) కళ్లు రక్తం ఓడుతున్నట్లు ఎర్రగా కనిపిస్తాయి. కంటి ఉప రితలంపైన ఏ చిన్నపాటి దెబ్బ తగిలినా, ఆ ప్రాంతంలో ఉండే రక్తనాళం చిట్లి రక్తం చుట్టుప్రక్కల ప్రదేశానికి విస్తరిస్తుంది. 
ఒక్కొక్కసారి కంటిని బలంగా నలు ముకున్న తరువాత ఇలా జరిగే అవకాశం ఉంది. 
కంటి వెలుపలి పొరల్లో పరచుకున్న ఈ రక్తం చర్మంలో కముకు దెబ్బల వలన ఏర్పడే నీలం రంగు మచ్చల్లా కాకుండా, స్వచ్ఛమైన ఎరుపు దనంతో, టొమాటో రంగులో కనిపించడానిక బైటి వాతావరణానికి దగ్గరగా ఉండి, ఆక్సీకరణం చెంద టమే. 
దెబ్బలు, ఒత్తిళ్ల వల్ల ఏర్పడే ఈ ఎరుపుదనం తగ్గిపోయి కన్ను మామూలు స్థితికి రావడానికి రెండు మూడు వారాలు పడుతుంది. కంటిలోపల ఇన్‌ఫ్లమేషన్‌ వలన కాని, కంటి లోపలి ద్రవాల్లో ఒత్తిడి పెరిగిపోవడం వలన కానీ, స్వచ్ఛపటలం (కార్నియా) వ్యాధిగ్రస్తమవడం వలన కాని ఇటువంటి ఎరుపు ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలకు త్రిఫలాగుగ్గులు, సప్తామృతలోహం వంటి మందులు పని చేస్తాయి.
 ధూళి కణాలు కంటిలో పడినప్పుడు కంటిలోని సున్నితమైన భాగాలు ప్రతిస్పందించి ఎరుపుద నాన్ని, కన్నీళ్లను కలిగిస్తాయి. స్రావాల కారణంగా కంటిలోని నలుసులు పల్చబడి బైటకు వెళ్లిపోవడం కోసం ఇలా జరుగుతుంది.
 ఒకవేళ ధూళి కణాలు బైటకు వెళ్లిపోకుండా, కంట్లో అలాగే ఉండిపోతే స్వచ్ఛమైన త్రిఫల కషాయాన్ని కంటిలో చిమ్మిచ్చి కొట్టాలి. అయినప్పటికీ, కంటిలోని నలుసు అలాగే ఉండిపోతే ఏదైనా సన్నటి గాజు కడ్డీవంటి దానిని కనురెప్పఐన పెట్టి కనురెప్పలను పట్టుకుని గాజు కడ్డీ ఆధారంగా తిప్పాలి. తరువాత కంటిలోని నలుసును బట్టతో తొలగించాలి.
నొప్పి అనేది ఇన్‌ఫెక్షన్‌కూ, ఇన్‌ఫ్లమేషన్‌కూ సూచన. కంట్లో నలుసులు పడటం, స్వచ్ఛపటలం వ్యాధిగ్రస్తం కావటం, కన్నులోపలి భాగం ఇన్‌ఫ్లేమ్‌ కావడం, కంటిలోపల వత్తిడి పెరగడం తదితర స్థానిక కారణాలే కాకుండా, మధుమేహం, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, సిస్టమిక్‌ ల్యూపస్‌ ఎర్తిమా టోసిస్‌ి వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల వలన కంటిలో ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో కారణానుగుణమైన చికిత్స చేయాలి.
-



అల్పాహారంతో తగ్గనున్న ఒత్తిడి

DIET
ఒత్తిడి అనేది ఈరోజులలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఒత్తిడి వలన మానసిక, శారీరక సమస్యలు వచ్చి తద్వారా అనేక వ్యాధు లకు కారణం అవుతుంది.ఇవి అధిక శ్రమ, డిస్టర్బ్‌ జీవనశైలి, అహారం సరిగా తీసుకోకపోవడంవల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. కొన్ని కారణాలవల్ల రక్తపోటు ,శారీరక, మానసిక వైకల్యాలకు, ఉద్వేగభరితమై వైపల్యాలకు దారితీ స్తాయి. ఒత్తిడి అనేది అనేకమందికి ఒక ప్రధానసమస్యగా పరిణమి స్తుంది.దీన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి, సంబంధిత సమస్యలను అరికట్టేం దుకు అనేక పద్దతులుఉన్నాయి. అటువంటి పద్దతిలో అల్పాహారం ఒకటిగా ఉంది.మీరు తిన్న తరువాత ఒత్తిడిని పొలిస్తే తక్కువ అనుభూతి,తక్కువ సమయం ఉంటుంది. అల్పాహార మార్పిడి ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ మార్గా లలో ఒకటి.ముఖ్యంగా తీపి అల్పాహారం చాలా సమర్థ వంతంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు.ఇది కొంత మందికి నమ్మకం లేనప్పటికి నిరూపితమైంది. అల్పాహారం అనేది ఒత్తిడిని అరికట్టేందుకు ఉత్తమపద్ధతి అని నిరూపించే కొన్ని కారణాలు పరిశీలిస్తే. హార్మోన్లు, మనకు టెన్షన్‌, పనిభారం, ఒత్తిడి,బాధ కలిగినపుడు మన శరీరంలోని కొన్ని ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.ఆ సమయంలో మన శరీరంలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది.
అప్పుడు మనశరీరానికి శక్తి లేక అలసటతో కూడిన అను భూతి కలుగుతుంది.ఆ సమయంలో ఒత్తిడి అరికట్టేందుకు స్పీట్‌ స్నాక్స్‌ తినడం ఉత్తమం అని పేర్కొనవచ్చు.స్పీట్‌ స్నాక్స్‌ ఒత్తిడి సంబంధిత హార్మోన్ల ఉత్పత్తి,వేగాన్ని తగ్గిస్తాయి.అప్పుడు తక్కువ హార్మోన్ల ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహారాలు, ఒత్తిడి తగ్గించడానికి అల్పా హారం కేవలం ఒక మార్గం కాకుండా ఒక ఆరోగ్యకరమైన మార్గంగా పేర్కొనవచ్చు.ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం వలన ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒత్తిడి తగ్గించటానికి ఆరోగ్య కరమైన ఆహారాలలో పండ్లు, బెర్రీలు, డార్క్‌,చాక్లెట్‌, పాల ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి.కాగా ఈ ఆహారాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులను తెలియజేస్తాయి. ప్రశాం తత, అల్పాహారం ఒత్తిడి అరికట్టేందుకు ఉత్తమ పద్దతు లలోఒకటి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెదడు, శరీరంద్వారా వెళ్లే ఆందోళన తగ్గిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జీవక్రియను మెరుగుపరిచి ఒత్తిడినితగ్గేందుకు దోహదం చేస్తుంది.

  • -

వయసు పైబడ్డాక కంటిచూపు మందగించడం, వినికిడి లోపం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఆడ,మగ ఎవరికైనా తప్పవు. అయితే, మహిళలకు ముఖ్యమైన శత్రువు ‘ఆస్టియోపోరోసిస్’ అని వ్యవహరించే గుల్ల ఎముకల వ్యాధి. ఈ జబ్బు కారణంగా ఎముకలు పలుచబడి లోపలికణాలు బలహీనమై, తేలికగా అవి దెబ్బతినే అవకాశం వుంటుంది. సాధారణంగా స్ర్తిలకు మెనోపాజ్ అనేది 45-50 ఏళ్ల వయసులో సహజం. మహిళల్లో రుతుక్రమం ఆగిపోవడం వల్ల అండాశయంలో అండాలు తగ్గిపోయి క్రమంగా మాయమైపోతాయి. ఈస్ట్రోజన్ అనే స్ర్తి హార్మోన్ విడుదల కావడం ఆగిపోతుంది. ఎముకల్లో ‘ఈస్ట్రోజన్ రిసెప్టార్లు’ అనే ప్రదేశాలుంటాయి. ఈస్ట్రోజను ఆగిపోగానే శరీరంలో కాల్షియం శాతం తగ్గిపోతుంది. రక్తంలో కాల్షియం పడిపోగానే ఎముకల్లోని కాల్షియం వేగంగా రక్తంలోనికి వెళ్లిపోతుంది. దాంతో ఎముకలు పటుత్వం కోల్పోయి గుల్లబారిపోతాయి. కాలి ఎముకలు, వెన్నుపూస వంటివి శరీర భారాన్ని మోస్తాయి గనుక అవి మెత్తబడి వంగడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. ఎవరికైనా తుంటి ఎముక విరిగితే మంచంలో నెలల తరబడి మగ్గిపోవాల్సి రావడం మనం చూస్తూంటాం. ఇలాంటి వారిలో కాల్షియం మరింతగా తగ్గిపోయి ఇతర అనారోగ్యాలు సైతం సంభవిస్తుంటాయి.
మెనోపాజు దశలోకి వచ్చినప్పటికీ కొంతమంది మహిళల్లో మాత్రమే ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంది. అలాంటి వారిని ‘హైరిస్క్’ కేటగిరీగా వైద్యులు పరిగణిస్తారు. ఎముకలు బలహీనపడడానికి ఎన్నో కారణాలున్నాయి.
పాలు, ఆకుకూరలు, ప్రొటీన్లు, ఇతర పోషకాలు లోపిస్తే ఎముకల వ్యవస్థ గట్టిగా తయారుకాదు. ఇలాంటి వారికి ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
వ్యాయామానికి దూరంగా ఉండేవారిలో, స్థూలకాయుల్లో ఎముకలు గట్టిగా వుండవు.
ఎండ తగలకుండా ఉండేవారిలో విటమిన్-డి, కాల్షియం తక్కువగా ఉంటూ ఎముకలు బలహీనంగా ఉంటాయి.
నలభై ఏళ్లు నిండకముందే మెనోపాజు వచ్చినవారికి ఈస్ట్రోజను తక్కువై, ఫలితంగా ఎముకలు దృఢంగా ఉండవు.
గర్భాశయం, ఓవరీలు తొలగించినవారికి, పిసిఓడి అనే జబ్బు వున్నవారికి, లివరు వ్యాధి, కిడ్నీ జబ్బులు వున్నవారికి ఎముకలు గుల్ల బారే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కొన్ని రకాల మందులు అంటే- స్టెరాయిడ్సు, థైరాయిడ్ మందు, మూర్ఛ నివారణ మాత్రలు చాలా కాలం వాడేవారికి ఆస్టియోపోరోసిస్, తద్వారా ఎముకలు విరగడం జరుగుతుంది. కాగా, యాంటీ కొయాగులెంట్సు- అంటే రక్తం గట్టకట్టకుండా వాడే మందులు, సుగరు వ్యాధికి వాడే మందులు, బిపికి వాడే మందుల వల్ల కూడా ఎముకలు బలహీన పడతాయని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
హార్మోన్లు, ఈస్ట్రోజను హార్మోనుకు విరోధంగా ప్రొజిస్టిరాన్ మందులు చాలాకాలం వాడకూడదు.
అధిక రక్తస్రావం అరికట్టడానికి స్ర్తిలు పిల్సు వాడడం మంచిది. ఒకవేళ ఆపరేషను అవసరమైనా కొద్దినెలలు పిల్సు (ఓ.సి. పిల్సు) వాడాక సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని నెలలు ఫామిలీ ప్లానింగు పిల్సు వాడి ఆపేసినా దాని లాభం రెండు రకాలు. మొదటిది ఎముకలు గట్టిపడటం, రెండవది ఓవరీ కాన్సరు రాకుండా రక్షణ కలగడం. ఈ రక్షణ 10-15 సంవత్సరాల వరకూ వుంటుందని శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. ఎముకలు గుల్ల బారే వ్యాధి నుంచి తప్పించుకునేందుకు మహిళలు తరచూ ఆరోగ్య తనీఖీలు చేయించుకుని, కాల్షియం, విటమిన్ ‘డి’ పరిమాణం, బోన్ డెన్సిటీ గురించి తెలుసుకోవాలి. అనారోగ్య సమస్యలకు ఏయే రకాల మాత్రలు ఎంతకాలంగా వాడుతున్నారో వంటి విషయాలు వైద్యులకు చెప్పాలి. అన్ని వయసుల ఆడవారూ నిత్యం వ్యాయామం చేస్తుండాలి. వయసు పైబడిన మహిళలు కింద కూర్చొని లేచేటప్పుడు చేయి ఆనించి శరీర భారాన్ని దానిపై మోపరాదు. కుదుపుల ప్రయాణాలు చేయకూడదు. బరువులు ఎత్తకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వృద్ధాప్యంలో ఎముకలు విరగకుండా కాపాడుకోవచ్చు. *
రక్తపోటుకు ఇంటి వైద్యం 


గుండె కొట్టుకుంటున్నపుడు సంకోచించి రక్తనాళాల ద్వారా రక్తాన్ని ఒత్తిడితో అన్ని శరీర భాగాలకు పంపుతుంది. రక్త నాళాలపై ఏర్పడిన ఈ రకమైన ఒత్తిడిని ‘‘సిస్టోలిక్‌ ప్రెషర్‌’’ అంటారు. ఇది సహజంగా రక్తపోటులో సూచించే 120/80 అంకెల్లో పెద్దది. పైన ఉండే నంబర్‌ అయిన 120 అంకెను సూచిస్తుంది. అలాగే గుండె వ్యాకోచించినపుడు గుండె చప్పుళ్ళ మధ్య గుండె కండరం విశ్రాంతి తీసుకుంటున్నపుడు తిరిగి రక్తంతో నింపబడేటప్పుడు కలిగే ఒత్తిడిని ‘‘డయాస్టోలిక్‌ ప్రెషర్‌’’ అంటారు. ఇది 120/80 అంకెల్లో చిన్నది, క్రింది నంబరు అయిన 80ను సూచిస్తుంది. సహజంగా ఆరోగ్యవంతుని రక్త ఒత్తిడి 120/80 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ రక్తఒత్తిడి 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్నే రక్తపోటు అంటారు. ఆధునిక వైద్యులు ‘‘బ్లడ్‌ ప్రెషర్‌’’ అంటారు. ఆయుర్వేదంలో రక్తవాతం అంటారు.


- సిస్టోలిక్‌ 120 కంటే తక్కువ, డయాస్టోలిక్‌ 80 కంటే తక్కువ ఉంటే సాధారణ స్థాయిగా గుర్తించాలి.


- రక్తపోటు వచ్చేముందు ‘‘సిస్టోలిక్‌ 120-139’’ వరకు, డయాస్టోలిక్‌ 80-89 వరకు ఉన్నపుడు రక్తపోటు వచ్చే దశలో ఉన్నట్టు తెలుసుకోవాలి.


మొదటిదశ: సిస్టోలిక్‌ ప్రెషర్‌ 140-159 వరకు, డయాస్టోలిక్‌ ప్రెషర్‌ 90-99 వరకు ఉన్నపుడు మొదటి దశగా గుర్తించాలి.


రెండవదశ: సిస్టోలిక్‌ ప్రెషర్‌ - 160 లేక అంతకన్నా ఎక్కువ.. డయాస్టోలిక్‌ప్రెషర్‌- 100 లేక అంతకన్నా ఎక్కువ ఉంటే
అధిక రక్తపోటు రెండవదశగా గుర్తించాలి.

అత్యవసర వైద్యం: సిస్టోలిక్‌ ప్రెషర్‌- 180 కంటే ఎక్కువ.. డయాస్టోలిక్‌ప్రెషర్‌- 110 కంటే ఎక్కువ ఉంటే తక్షణం వైద్య సహకారం అందివ్వాల్సిన దశగా గుర్తించాలి.


బ్లడ్‌ ప్రెషర్‌ సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉన్నపుడు చాలాసార్లు రీడింగ్‌ తీసి నిర్ధారించుకోవాలి. అంతేగాని ఒకసారి రీడింగు తీసి బ్లడ్‌ ప్రెషర్‌ ఉన్నట్లు నిర్ధారించకూడదు. 140/90 ఉన్నవారు మాత్రమే మందులు ప్రారంభించాల్సి వస్తుంది. వయస్సు మీరిన వారిలో శ్రమజీవుల్లో రక్తపోటు ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, కోపం, మానసిక ఉద్వేగాల్లో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయేప్పుడు అందరిలో రక్తపోటు తక్కువస్థాయిలో ఉండటం సహజం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం, మానసిక ఆందోళనలు, నిద్రలేమి, కిడ్నీ వ్యాధులు మొదలైనవి అధిక రక్తపోటుకు కారణమవుతాయి.


ఇంటి వైద్యం..

 - ఒక గ్రాము వెల్లుల్లిని మెత్తగా నూరి కప్పు మజ్జిగలో కలిపి రోజూ మూడు పూటలా తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది. వెల్లుల్లి వాసన గిట్టని వారు నెయ్యిలో దోరగా వేయించి వాడుకోవచ్చు.

- సర్పగ్రంధ పౌడరును (మూలికల షాపుల్లో దొరుకుతుంది) అర టీ స్పూన్‌ చొప్పున రోజుకి 3 సార్లు నీటితో కలిపి ఇస్తుండాలి.
- ఆయుర్వేద షాపుల్లో దొరికే క్షీరబలాతైలం (వందసార్లు కాచి తయారు చేసింది) రోజూ ఉదయం 5 చుక్కలు కప్పు పాలల్లో కలిపి తాగుతుండాలి.
- ఒక టీ స్పూన్‌ ఉసిరికాయ రసాన్ని ఒక టీ స్పూన్‌ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- తరచుగా నల్లద్రాక్ష పండ్లుగాని, రసాన్ని గాని తీసుకుంటుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- బంగాళాదుంపలు పై చర్మంతో పాటు బాగా ఉడికించి చర్మం వలిచి తినడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు.
- మందార పువ్వులను ఎండించి పొడిగా నలిపి పాలతో టీగా కాచి రోజుకి 2-3 సార్లు ప్రతి రోజు తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
- దాల్చిన పౌడరును కూరల్లో, వేపుళ్లు, టిఫిన్లలో, కాఫీలో చల్లుకొని వాడటం వల్ల కూడా బి.పి.ని అదుపు చేయొచ్చు.
- ప్రతి రోజూ టీలో యాలకుల చూర్ణం కలిపి తాగాలి. ఈ అలవాటు వల్ల బి.పి. త్వరగా కంట్రోల్‌లోకి వస్తుంది.
- చారెడు ధనియాలు దంచి వెడల్పు స్టీలు గిన్నెలో పోసి 200 గ్రాముల నీటిని పోసి మంచులో కానీ, ఫ్రిజ్‌లో కానీ రాత్రంతా పెట్టి ఉదయాన్నే వడబోసి చక్కెర కలిపి తాగితే(చక్కర వ్యాధి లేనివారు) వారంలోనే వ్యాధి అదుపులోకి వస్తుంది.
ఈ నాలుగూ మిస్‌ అవ్వొద్దు.. 


మండే ఎండలను తట్టుకోలేక రకరకాల పండ్లు, జ్యూస్‌లు తాగి ఉపశమనం పొందుతుంటాము. అయితే ఎన్ని పండ్లు తింటున్నా.. ఈ నాలుగు పండ్లను మాత్రం మిస్‌ అవ్వకండి. ఎందుకంటే వేసవిలో అత్యంత మేలు చేసే గుణాలు వీటిలో పుష్కలం...

పైనాపిల్‌: ‘బ్రొమిలైన్‌’ అనే ఎంజైమ్‌ కలిగిన పండ్లు తక్కువ. అది పైనాపిల్‌లో ఉంటుంది. శరీరంలోని కొవ్వుల్ని, ప్రొటీన్లను త్వరగా అరిగేందుకు సహాయపడుతుందీ ఎంజైమ్‌. ఇక, పైనాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలకైతే కొదవ లేదు. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, కాల్షియం, పాస్పరస్‌, పొటాషియం వంటివీ అధికం. ఈ పండు జలుబుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఎముకల పటిష్టానికీ తోడ్పడుతుంది. పళ్లు మరింత గట్టిపడేందుకు ఉపకరిస్తుంది.


పుచ్చకాయ: అత్యధిక పీచు, నీళ్లు కలిగిన పండ్లలో తిరుగులేనిది వాటర్‌మిలాన్‌. ఎండాకాలం వడదెబ్బ కొట్టకుండా కాపాడటంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. మరీ ముఖ్యమైన ప్రయోజనం ‘లైకోపిన్‌’ అనే ఔషధగుణం కలిగి ఉండటం. మండే ఎండలకు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది లైకోపిన్‌. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్‌, విటమిన్‌ ఎ, బి6, సి, కాల్షియం, పీచు ఒకే పండులో ఇన్నేసి పోషకాలు దొరకడం పుచ్చకాయతోనే సాధ్యం. జుట్టు రాలడం, అజీర్తి, కనుచూపు మందగింపు వంటి సమస్యలను తగ్గిస్తుందీ పండు. గుండె జబ్బులను అడ్డుకునే శక్తి కూడా దీనికుంది.


కొబ్బరి నీళ్లు తాగేందుకు రుచిగా అనిపించవు కాని.. ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. ఏ ఇతర పండ్లు అందించనన్ని మేళ్లు ఇది అందిస్తుంది. ఎండాకాలంలో దప్పిక తీరేందుకు ఆత్రంతో శీతలపానీయాల జోలికి వెళుతుంటారు కాని.. వాటికి బదులు కొబ్బరి నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది. ఆ ప్రయోజనానికి తోడు వేడి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోటైట్లు సమకూరుతాయి. శరీరం కూడా వెంటనే చల్లబడుతుంది. తక్షణశక్తితో పుంజుకోగలం. మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి కొబ్బరి నీళ్లు. కిడ్నీలో రాళ్లను కూడా ఏర్పడనీయవు. యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ను రానివ్వవు. రక్తంలో ప్లాస్మా తగ్గకుండానూ చూస్తుంది కొబ్బరి. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గనివ్వదు.


మామిడి: తీయతీయటి మామిడి తినందే వేసవి మజా అనిపించదు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లను మిస్‌ అవ్వకూడదు. పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ రారాజే! ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఈ రోజుల్లో ఎక్కువమందిని భయపెడుతున్న క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే గుణం మామిడికి ఉంది. కొలోన్‌, బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్లను వీలైనంత వరకు రానివ్వదు మామిడి. వీటితోపాటు కొవ్వును తగ్గించగలిగే మరో మంచి గుణం ఈ పండు సొంతం. చర్మసౌందర్యానికి, కనుచూపు మెరుగుదలకు చక్కటి సహాయకారి.
ఉపశమనాన్నిచ్చే ఆరు మసాజ్‌లు 

మసాజ్‌లు అంటే చాలు చాలామంది ముఖం అదొలా పెడుతుంటారు. కానీ అవి ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. అందుకే ఈ మసాజ్‌లను చేయించుకుని రిలాక్స్‌ కండి.

బాలినెసె మసాజ్‌...
ఇది ఇండొనేసియాకు చెందిన సంప్రదాయ మసాజ్‌. ఈ మసాజ్‌కు పుట్టిల్లు బాలి దీవులు. ఈ టెక్నిక్‌లో మసాజ్‌తోపాటు ఆక్యుప్రషర్‌, రిఫ్లెక్సోలజీ, ఆరోమాథెరపీ వంటి రకరకాల ప్రకియలు మిళితమై ఉంటాయి. రిలాక్స్‌ అవడానికి ఈ టెక్నిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కండరాలను వదులుచేయడంతోపాటు శరీరంలో నొప్పి బాపతు బాధలను పోగొడుతుంది. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు విశ్రాంతి స్థితిని పొందుతుంది. శరీరానికి నూతనోత్తేజం వ స్తుంది. కండరాలు బాగా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ టెక్నిక్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్‌ తగ్గుతుంది. నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు ఉండవు.

డీప్‌ టిష్యూ మసాజ్‌...
నిత్యం వర్కవుట్లు చేయలేని వారికి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికొకసారి ఈ మసాజ్‌ని చేయించుకోవాలి. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మెదడు, శరీరం బాగా రిలాక్స్‌ అవుతాయి. అంతేకాదు శరీరంలో తలెత్తే రకరకాల నొప్పుల్ని, బాధల్ని ఈ మసాజ్‌ పోగొడుతుంది. ఈ మసాజ్‌ వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో సేదదీరుతారు. ‘టెక్స్టింగ్‌ నెక్‌’ (మొబైల్‌లో తరచూ మెసేజ్‌లిస్తుండడం వల్ల మెడకు తలె త్తే నొప్పులు), ‘హంచ్డ్‌ ఒవర్‌ లాప్‌టాప్‌ సిండ్రోమ్‌’ (హెచ్‌ఔల్‌ఎస్‌) సమస్యలు కూడా తగ్గుతాయి.

హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌...
ఈమధ్యకాలంలో హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌ని చాలామంది చేయించుకుంటున్నారు. ఈ పద్ధతిలో కీళ్ల దగ్గర హెర్బల్‌ బాల్స్‌ పెడతారు. ఒంటికి నూనె బాగా పట్టించి హెర్బల్‌ బాల్స్‌ పెట్టడం వల్ల ఆ మూలికలు నూనెలో నానినట్టవుతాయి. దీంతో కండరాలు రిలాక్స్‌ అవుతాయి. మోకాళ్లు, మడమలు, భుజాల వంటి భాగాల్లో వీటిని పెడతారు . హెర్బల్‌ ఆయిల్‌ని శరీరానికి పెట్టేటప్పుడు ప్రత్యేకమైన సో్ట్రక్స్‌, టెక్నిక్స్‌ను ప్రయోగిస్తారు. అంతేకాదు ఆరై్త్రటిస్‌, బ్యాక్‌, జాయింట్‌పెయిన్స్‌, ఆస్తమా, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మూలికల వల్ల కీళ్ల బాధలు తగ్గుతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

స్పోర్ట్స్‌ మసాజ్‌....
ఇదొక చికిత్సా విధానం. బిగుసుకుపోయిన కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. పనిచేయని కండరాల్లో కదలికలు తీసుకువస్తుంది. టిష్యూలు బాగా పని చేస్తాయి. ఈ మసాజ్‌ చేయించుకోవడం శరీర కదలికల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారుల ఆట తీరు బాగా మెరుగుపడుతుంది. వారు తొందరగా గాయాలపాలు కారు. ఈ మసాజ్‌ వల్ల బిగబట్టినట్టున్న టిష్యూలు వదులై వేగంగా పని చేస్తాయి.

టెంపుల్‌ మసాజ్‌...
సాధారణంగా ఈ టెక్నిక్‌ను థాయ్‌లాండ్‌లోని దేవాలయాల్లో చేస్తారు. ఈ మసాజ్‌ శరీరంపై తేలికపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. సె్ట్రచింగ్‌కు సహాయపడుతుంది. ఈ మసాజ్‌ వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. బాగా నిద్రపోతాం. శరీరంపై, మెదడుపై అదుపు సంపాదిస్తాం. వాటి గురించిన అవగాహనను పెంపొందించుకుంటాం. అంతేకాదు బ్లాక్‌ అయిన ఎనర్జీ విడుదలవుతుంది. శరీరం లోపల ఉండే ఎనర్జీని కూడా ఈ మసాజ్‌ సమతుల్యం చేస్తుంది. కండరాల ఒత్తిడిని పోగొట్టి అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండేట్టు సహాయపడుతుంది.

రీ ఎనర్జైసింగ్‌ సన్‌ స్టోన్స్‌...
ఈ తరహా మసాజ్‌లో గోరువెచ్చగా ఉన్న రాళ్లను శరీరంలోని ఏడు చక్రాలపై ఉంచుతారు. వీటిని శక్తి కేంద్రాలుగా చెప్తారు. క్రీడాకారులకు, హైపర్‌యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఇది ఎంతగానో పనికి వస్తుంది. ఈ మసాజ్‌ను చేస్తే అలసట, బలహీనతలు పోతాయి. ఆరై్త్రటిస్‌, కండరాల సమస్యల వంటి వాటిపై ఈ మసాజ్‌ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
‘చింత’ తీరుస్తుంది ఇలా..!


చింతచెట్టు వైపు చూడగానే నోరూరుతుంది... గుత్తులు గుత్తులుగా చెట్టునిండా వేలాడే చింతకాయలు పిందె దశ నుంచి పండిన కాయలుగా మారేదాకా ఒక్కో దశలో ఒక్కో రుచినిస్తుంటాయి. చింతకాయను పచ్చళ్లు, కూరల తయారీకి వాడుతుంటారు. చింత కాయలలో ఉండే గుణాలు, లాభాల గురించి తెలుసుకుందాం..



ఔషధ గుణాలు...
చింతచిగురు, పిందెలు, కాయలు గుల్ల(పండిన) కాయలు, ఎండు చింత అన్ని ఉపయోగమే. చింత గుజ్జులో జీర్ణక్రియ, కూలింగ్‌, లాక్సేటివ్‌, యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. గ్యాస్ర్టిక్‌, జీర్ణసంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో చింతపండును వాడుతారు. ఉదరంలో ఉండే నులిపురుగుల్ని చింత ఆకు నశింప చేస్తుంది. జాండిస్‌ గలవారికి ఇదీ ఔషధం లాంటిది. చింత కలప గట్టిగా ఉండి, ఇళ్ల కట్టడాలకు, ఫర్నిచర్‌గా బాగా పనికొస్తుంది. గన్‌ పౌడర్‌కు బొగ్గుగా ఉపకరిస్తుంది.



జీర్ణ వ్యాధులు...
పండిన చింతకాయలు నుంచి పైపెంకు, గింజ తిసి ఎండబెట్టి చింతపండు తయారు చేస్తారు. గుజ్జు వికారం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నీటిలో నానబెట్గి గుజ్జు పిండుకోవాలి. ఆకలి మందగించినప్పుడు, ఆహారం తినాలన్న కోరిక నాశించినప్పుడు ఇది ఉపకరిస్తుంది.



కాలిన గాయాలకు...
చింతచిగురు కాలిన గాయాలకు ఉపయుక్తమైన చికిత్స. ఆకుల్ని సెగపై కాల్చి పొడి చేసి జల్లించి, నువ్వుల నూనెతో కలిపి కాలిన గాయాలపై రాయాలి. కొద్దీ రోజుల్లోనే గాయం మారుతుంది. చింత ఆకులు నలిపి నీటిలో వేసి, కషాయం తయారు చేసి జాయింట్లు మడమలపై రాస్తే నొప్పుల వాపు తగ్గుతాయి.



స్కర్వీ...
ఈ వ్యాధి మిటమిన్‌ సీ వల్ల కలుగుతుంది. చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి.చిగర్లు మెత్తబడి, రక్తం వస్తుంది. మచ్చలు ఎక్కువగా తోడలు, కాళ్లపై కనిపిస్తాయి. ఈ వ్యాధి గల పేలవంగా, నిస్సత్తువగా ఉంటారు. చింతపండు గుజ్జులో మిటమిన్‌ సీ అధికంగా ఉండి స్కర్వీ నివారిస్తుంది.



సాధారణ జలుబు...
చింతపండు, మిరియాల రసం జలుబు, దగ్గులకు మంచి దక్షిణాది సూప్‌. దీనిని దక్షిణ భారతీయులు ఎక్కువగా తయారు చేసుకుంటారు. చింతపండు పిండిన నీరు పోసి టీ స్పూన్‌ మిరియాల పొడి వేసి తాలింపు పెడితే నోటికి రుచిగా ఉంటుంది. జ్వరం నుంచి కోలుకున్నప్పుడు జీర్ణశక్తినిస్తుంది.
విరేచనాలు...
పేగులు ముఖ్యంగా కలోన్‌కు ఇబ్బంది కలిగినప్పుడు బంక వీరేచనాలవుతాయి.ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది. జ్వరం, కడుపు నొప్పి వస్తుంది.చికిత్స చేయకుండా వదిలిస్తే సమస్య పెరుగుతుంది. చింతపండు పానీయం చికిత్సగా ఉపకరిస్తుంది.
గొంతులో మంట...
గొంతులో గురగురలాడుతున్నట్టుంటే చింతపండు నీటిలో పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో చింతపండు వేసి బాగా మరిగించి తయారు చేసుకోవాలి. ఎండు చింత ఆకులు పొడిని కూడా పుక్కిలించుకోవడానికి వాడుకోవచ్చు. భారతీయ ఆహారంలో చింతకాయ పచ్చడి ప్రసిద్ది గాంచింది. చింతచిగురు పప్పు రుచి చూడాల్సిందే.
చింత గింజలు ఎంతో మేలు...
చింత పండు నుంచి తీసిన గింజలు సౌడు భూముల్లో పోస్తారు. దీంతో పంట దిగుబడి అధికంగా వస్తుంది. అంతేకాకుండా గింజల నుంచి మెదక్‌ జిల్లా సిద్దపేట లో రంగులను(కుంకుమ) తయారు చేస్తారు.
రుతుశూలకి విరుగుడు 


కొంతమంది స్త్రీలకు రుతు సమయానికి రెండు రోజులు ముందుగానే పొత్తికడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమై రుతుస్రావం జరుగుతుంది. ఈ రకంగా విపరీతమైన నొప్పితో రుతుస్రావం జరగడాన్ని ఆయుర్వేదంలో కష్టావర్తమని, రజోకృచ్ఛమని, రుతుశూల అని పిలుస్తారు. కొన్ని గ్రామాల్లో కొంతమంది దీనినే ముట్టునొప్పి అని కూడా పిలుస్తారు. త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలు ప్రకోపించడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుందనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఇవి రెండు రకాలు. మొదటిది యుక్త వయసులోని ఆడపిల్లలకు వచ్చేది, రెండవది 30 సంవత్సరాల లోపు స్త్రీలలో వచ్చేది.


మొదటిరకం రుతుశూల

  • ఇది కండరాల సంకోచంతో కలుగుతుంది.
  • రుతుస్రావానికి కొద్ది గంటల ముందు వస్తుంది.
  • ఈ నొప్పి వచ్చినపుడు అరుదుగా నడుం నొప్పి, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
రెండవరకం నొప్పి
  • కటివలయం (పెల్విక్‌ గర్డిల్‌ ) లోని గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్‌ ట్యూబుల వాపు, నొప్పి వల్ల ఏర్పడుతుంది.
  • పొత్తి కడుపు దిగువ భాగంలో నొప్పి ఎక్కువ సేపు వస్తుంటుంది. 
  • రుతు సమయానికి రెండు లేక అయిదు రోజుల ముందుగానే వస్తుంది.
  • మలబద్ధకం ఉండే స్త్రీలలో తరచుగా ఈ నొప్పి వస్తుంటుంది.
ఈ రెండు రకాల రుతునొప్పులతో బాధపడే స్త్రీలు, మలబద్ధకంతో బాధపడకుండా జాగ్రత్తపడాలి. దీని వల్ల కటి వలయంలో ఉన్న అపాన వాయువులు, మలమూత్రాలతో పాటు బయటకు వెళ్లిపోవడం వల్ల గర్భాశయంపైన, ఇతర అవయవాలపైన ఏమాత్రం ఒత్తిడి ఏర్పడదు. తర్వాత మూలికా చికిత్స వల్ల ఈ అనారోగ్య పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు.
  • కలబందలోని గుజ్జ్జుకి పంచదార కలిపి ఉదయాన్నే ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఈ నొప్పి తగ్గుతుంది.
  • ఇంగువను పొడిచేసి 1 టీ స్పూన్‌ పొడిని ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటిలో గాని, పాలు, ఇతర ఆహారపదార్థాలతో గాని కలిపి వాడుతుంటే రుతుశూల తగ్గిపోతుంది.
  • రావిచెట్టు బెరడు, చింత చెట్టు బెరడు సమంగా కలిపి మెత్తగా నీటితో నూరి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును రోజూ ఉదయం, రాత్రి, భోజనం ముందు ఒక టీ స్పూన్‌ కప్పు నీటిలో కలిపి వాడితే రుతు నొప్పి తగ్గుతుంది.
  • ఉమ్మెత్త ఆకులను మరుగుతున్న నీటిలో వేసి నానబెట్టి తీసి పొత్తి కడుపు క్రింది భాగంలో కాపడం పెట్టిన తర్వాత ఆకులను తీసి సరిపడినంత వేడిగా ఉన్నపుడు పొత్తి కడుపు క్రింది భాగంపై వేసి ఉంచితే నొప్పి త్వరగా తగ్గుతుంది.
  • గుప్పెడు మేడి చెట్టు ఆకులను లీటరు నీటిలో వేసి అర లీటరు మిగిలేట్టు మరిగించి ఆ నీటితో మర్మావయాన్ని శుభ్రపరచుకుంటే వెంటనే రుతు నొప్పి తగ్గుతుంది.
  • 20 మిల్లీ లీటర్ల తురకవేపాకు రసంలో అంతే సమంగా గేదె పెరుగు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే నొప్పి తగ్గిపోతుంది.
వెరికోస్‌ వెయిన్స్‌తో సతమతం


టీచర్లు, ట్రాఫిక్‌ పోలీసులు, సెక్యూరిటీగార్డులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు.. ఇలాంటి వాళ్లందరూ గంటల తరబడి నిల్చుని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో ఏడు శాతం మందికి వెరికోస్‌ వెయిన్స్‌ వస్తోందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. కాళ్లలోని పిక్కలు, కింది భాగంలోని నరాలు మెలికలు తిరగడం, ఉబ్బడం ఈ వ్యాధి లక్షణం.

ముంబయిలోని వోక్‌హార్ట్‌ హాస్పిటల్‌ ఈ తాజా సర్వేను చేపట్టింది. చాలా మంది జబ్బు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోరు. అలాగే వదిలేస్తే.. కొన్నాళ్లకు పలు రకాల కాంప్లికేషన్స్‌ వస్తాయన్నది సర్వే నిపుణుల అభిప్రాయం. దాంతోపాటు మొండివ్యాధిగా మారే అవకాశం కూడా ఉంది. చాలామంది నరాలు ఉబ్బిన జబ్బును పెద్దగా పట్టించుకోరు. డయాగ్నసిస్‌ చేయించుకోరు. ముంబయిలోని వంద మంది ట్రాఫిక్‌ పోలీసులను వెరికోస్‌ వెయిన్స్‌కు సంబంధించిన పరీక్షల్ని చేశారు. వీరిలో అయిదు శాతం మందికి సమస్య ఉన్నట్లు తేలింది. ‘జబ్బు జీవితాన్ని ఏమీ చేయదుకాని కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల నరాలు బలహీనపడతాయి. ఇక్కడ మరొక సమస్య ఉంది- వెరికోస్‌ వెయిన్స్‌ సహజంగా పైకి కనిపిస్తుంది. అంటే నరాలు ఉబ్బినట్లు, మెలికలు తిరిగినట్లు కనిపిస్తాయన్నమాట. అయితే కొందరిలో ఇలా కనిపించదు. వీరికి జబ్బును గుర్తుపట్టడం కష్టం. కేవలం డయాగ్నసిస్‌ ద్వారా మాత్రమే నిర్ధారించగలము. సకాలంలో బాధితులకు చికిత్స చేయకపోతే శస్త్రచికిత్స కూడా అవసరం కావొచ్చు. ఈ జబ్బుకు ఇప్పుడు అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే - ఎండో వెనస్‌ లేజర్‌ థెరఫీ (ఈఎల్‌విటి). ఇది చాలా సులువైన సురక్షితమైన చికిత్స. డేకేర్‌ అడ్మిషన్‌లోనే చేయించుకుని ఇంటికి వెళ్లొచ్చు’నని అధ్యయనకారులు పేర్కొన్నారు

యంగ్ మమ్మీలు స్లిమ్‌గా ఉండాలంటే... (11-May-2015)



పిల్లలు పుట్టిన వెంటనే వేగంగా సన్నబడిపోవాలని నేటి తరం అమ్మలు కోరుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెలమెల్లగా వర్కవుట్ల సంఖ్యను పెంచుతూ మాత్రమే ఒంట్లోని కొవ్వును కరిగించుకోవాలని సూచిస్తున్నారు.



బాలివుడ్‌ తారలు ఐశ్వర్యారాయ్‌, శిల్పా శెట్టి, కాజోల్‌, కరిష్మా, ఇంకా జెన్నిఫర్‌ లోపెజ్‌, అమెరికన్‌ మోడల్‌ సారా స్టాగ్‌ వంటి సెలబ్రిటీలను చూస్తుంటే వీళ్లు పిల్లల తల్లులా అని ఆశ్చర్యమేస్తుంది. తమ నాజూకైన శరీర లావణ్యంతో వీళ్లు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నారు. కొత్తగా తల్లులైన నేటి వివాహిత యువతులు తాము కూడా సినీతారల్లాగ స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. బిడ్డను ప్రసవించిన కొద్ది రోజులకే స్లిమ్‌గా అయిపోవాలని తాపత్రయ పడుతున్నారు. అందుకోసం తీవ్రస్థాయిలో వ్యాయామాలను చేస్తున్నారు. కానీ... అలా చేయడం వారి ఆరోగ్యానికి ప్రమాదకరం.


వేగంగా బరువు తగ్గొద్దు...
పిల్లల్ని కన్న వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించడం వల్ల శారీరకంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హఠాత్తుగా బరువు తగ్గినా శరీరం తట్టుకోలేదు. ముఖ్యంగా చిన్నారులకు తల్లిపాలను పట్టే అమ్మలు లావుతగ్గడానికి ప్రయత్నించ కూడదు. డైటింగ్‌ కూడా వాళ్లకి మంచిది కాదు. అయినా చేయడానికి ప్రయత్నిస్తే శరీరంలోని పోషకవిలువలు తగ్గిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొత్తగా బిడ్డను కన్న తల్లులు మెల్లగా బరువు తగ్గాలి.

ప్రసవానంతర వ్యాయామాలు...
బిడ్డను కన్న తర్వాత (పోస్ట్‌ డెలివరీ ఎక్సర్‌సైజెస్‌) చేసే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. ఇవి కొత్తగా తల్లులైన వారి శరీరంలోని కొవ్వును కరిగించడమే కాదు శరీరానికి కావాల్సిన అదనపు ఎనర్జీని అందిస్తాయి. శరీరలోపల భాగాలను సంరక్షిస్తాయి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్ల మెల్లగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవాలి. నార్మల్‌ డెలివరీ అయితే నాలుగు వారాల అనంతరం వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. సిజేరియన్‌ అయితే ఆరు వారాల తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి. ఈ వ్యాయామాలు చేస్తే స్లిమ్‌గా తయారవుతారు...

హిప్‌ థ్రస్టర్‌: ఈ వర్కవుట్‌ వల్ల పెల్విక్‌ చుట్టూతా ఉన్న కండరాలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది.
వి-పోజ్‌ హోల్డ్‌ అండ్‌ పుషప్‌: ఈ వర్కవుట్‌ చేయడం వల్ల పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. వెన్ను భాగం దృఢంగా తయారవుతుంది.
ప్లాంక్స్‌: ఇవి చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
లాంజెస్‌ అండ్‌ స్క్వాట్స్‌: లెగ్‌ వ ర్కవుట్లలో ఇవి చాలా ప్రధానమైనవి. వీటిని చేయడం వల్ల లోయర్‌ బాడీపై ఒత్తిడి బాగా పడుతుంది. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
చెస్ట్‌ వర్కవుట్‌: రొమ్ములు చక్కటి ఆకారంలో ఉండడానికి చెస్ట్‌ వర్కవుట్లు బాగా సహాయపడతాయి.
డెడ్‌లిఫ్ట్‌: ఇది శరీరం మొత్తానికి వ్యాయామం ఇస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడే లింఫటిక్‌ గ్లాండ్‌ను క్రమబద్ధీకరిస్తుంది.



ఎలాంటివి తినాలి?
కొత్తగా ‘తల్లు’లైన వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్నాం కదా అని తక్కువ కేలరీలున్న ఆహారం మాత్రమే తిని కడుపు మాడ్చుకోకూడదు. వీళ్లు తినే డైట్‌లో రకరకాల పండ్లు, కూరగాయలు ఉండాలి. పసుపు, ఆరంజ్‌ రంగులున్న పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి, పీచ్‌, నిమ్మ వంటి వాటిల్లో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో పీచు పదార్థాలతోపాటు తక్కువ పరిమాణంలో మాత్రమే కాలరీలు ఉంటాయి. ఆకుకూరలు కూడా బాగా తినాలి. అలాగే యాంటాక్సిడెంట్లు బాగా ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది. పరిమిత స్థాయిలో డ్రైఫ్రూట్స్‌ను స్నాక్‌గా తీసుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగితే జీవక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాదు కొవ్వు సైతం వేగంగా కరుగుతుంది.

ఇవి గమనించాలి...

వ్యాయామాలు చేసేటప్పుడు కొత్తగా తల్లులైన వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సర్టిఫైడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. వర్కవుట్లు చేయడం ప్రారంభించేముందు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించాలి. వ్యాయామాలు చేసేటప్పుడు పొత్త్తికడుపు భాగంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినావర్కవుట్లు చేయడంఆపేయాలి. ప్రసవ సమయంలో కాంప్లికేషన్స్‌ ఎదుర్కొన్న వారు వాకింగ్‌ లాంటి తేలికపాటి వ్యాయామాలను మాత్రమే చేయాలి. అలాగే సులువుగా ఉండే యోగాసనాలను కూడా చేయొచ్చు. రోజుకు 20-30 నిమిషాల చొప్పున వారానికి మూడు పర్యాయాలు వ్యాయామాలు చేస్తే చాలు.


అవి అపోహలే...
బిడ్డను కన్నతర్వాత వర్కవుట్లు చేయడం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిల్లో స్ర్టెంగ్త్‌ ట్రైనింగ్‌ మంచిది కాదనే అభిప్రాయం ఒకటి. కానీ బిడ్డను కన్న తర్వాత సె్ట్రంగ్త్‌ ట్రైనింగ్‌ చేసిన తల్లులు ఎంతో వేగంగా మంచి ఫలితాలు పొందరని పలు స్టడీలు చెప్తున్నాయి. బిడ్డలు పుట్టిన తర్వాత పొట్ట ఫ్లాట్‌ అవదనేది మరొక అపోహ. ఈ అభిప్రాయం కూడా తప్పే. పొట్ట తగ్గడం చాలామందిలో చూస్తున్నాం. అలాగే తల్లులు వర్కవుట్‌ చేసిన తర్వాత పిల్లలకు ఫీడ్‌ ఇవ్వకూడదంటారు. ఇది కూడా అపోహే. వ్యాయామాలు చేయడం వల్ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఎలాంటి దుష్ప్రభావం పడదు
పరగడుపునే వెల్లుల్లి తింటున్నారా?

పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లి ఎందుకు తినాలంటే..

- ఇది నాచురల్‌ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ.

- అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు వెల్లుల్లి దివ్యౌషధం. రోజూ క్రమం తప్పకుండా తింటే హైబీపీ నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
- కాలేయం, పిత్తాశయం పనితీరును మెరుగుపరిచే రసాయనాలు వెల్లుల్లిలో ఉన్నాయట. కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచడంతోపాటు వ్యర్థాలను బయటికి పంపే ప్రక్రియకు దోహదపడుతుంది వెల్లుల్లి. ఆకలిని కూడా పెంచుతుంది.
- మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్‌, గ్యాసి్ట్రక్‌ సమస్యలకు చక్కటి విరుగుడు. కొన్ని రకాల కేన్సర్ల నిరోధానికి కూడా పనికొస్తుంది.
- న్యుమోనియా, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. టీబీ బాధితులు కూడా తప్పనిసరిగా వెల్లుల్లిని తింటే మంచిది.
- అయితే వెల్లుల్లితో ఇన్నేసి ఉపయోగాలు ఉన్నప్పటికీ - కొందరికి ఇది తింటే పడదు. చర్మం మీద అలర్జీ వస్తుంది. ఇంకొందరికి శరీరం ఉన్నట్లుండి వేడి చేస్తుంది. తలనొప్పికూడా వస్తుంది. ఇటువంటి వాళ్లు వెల్లుల్లిని తినకూడదు.
కిడ్నీలో రాళ్లు..హోమియోతో మాయం

కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది పాలకూర, టమోట తినడం వల్ల ఏర్పడతాయి అనడం అపోహ. అవి కేవలం ప్రేరేపితాలు మాత్రమే. కారణాలు కావు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి వగైరా వాటి గురించి మనం తెలుసుకుందాం.



ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 20 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో సీ్త్రల కంటే పురుషులలో 2 నుంచి 3 రెట్లు అధికంగా గమనించవచ్చు. చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.


మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి లవణాల సమతుల్యతను కాపాడుతుంది. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరుతాయో అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడతాయి. కాని వాడుక భాషలో వీటన్నింటిని ‘కిడ్నీలో రాళ్లు’ అంటుంటారు.


కారణాలు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరికొన్ని ఇతర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో కిడ్నీలు ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించటం వల్ల రాళ్లు ఏర్పడతాయి. కొందరిలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లు, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్‌ పారాథైరాయిడిజం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలోని విటమిన్‌-ఎ శాతం తగ్గడం తదితర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవికాకుండా మూత్రంలోని రాళ్లని ప్రేరేపించే కారణాలను ప్రిడిస్పోసింగ్‌ ఫ్యాక్టర్స్‌ అంటారు.


ఇవి ముఖ్యంగా ఆహారంలో మాంసకృతులు, సోడియం(ఉప్పు) అధిక మోతాదులో తీసుకోవడం, పాధారణం కంటే తక్కువ మోతాదులో నీటిని తాగటం(1.5 లీటర్ల కన్నా తక్కువ), కొన్ని ఇతరత్రా జబ్చుల వల్ల ముఖ్యంగా హైపర్‌కాల్సేమియా, చిన్నప్రేగు ఆపరేషన్లు, రీనల్‌ట్యూబులార్‌ అసిడోసిస్‌, జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని రకాలైన మందులు ఆసి్ట్రన్‌, ఆంటాసిడ్స్‌, విటమిన్‌-సి, కాల్షియం సప్లిమెంట్ల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.


లక్షణాలు: విపరీతమైన కడుపునొప్పి, నడుమునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి ప్రధాన లక్షణాలు. కొంత మందిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వల్ల ఏదో ఒకవైపు నడుంనొప్పి రావడం, నొప్పితోపాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే రీనల్‌ కోలిక్‌ అంటారు. కొంతమందిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల కలిగే నొప్పిని యురిటరిక్‌ కోలిక్‌ అంటారు. నడుము, ఉదరం మధ్యభాగంలో విపరీతమైన నొప్పిరావడాన్ని ఫ్లాన్క్‌పెయిన్‌ అంటారు. అక్కడ నుంచి నొప్పి పొత్తి కడుపుకు, గజ్జలకు లేదా కాళ్లలోకి పాకుతుంది.


నొప్పితోపాటు వాంతులు, జ్వరం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా కనిపిస్తుంది. మరికొందరిలో కండరాల బిగుతు, నడుము, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనబడతాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలూ కనపడకపోవచ్చు. అలా లక్షణాలేవీ కనపడకుండా కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైలెంట్‌ స్టోన్స్‌ అంటారు.


నిర్ధారణ పరీక్షలు
1. మూత్రపరీక్ష (మూత్రంలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, రక్త కణాలు, స్పటికలు, క్యాస్ట్స్‌లను పరీక్షించడం).
2. రక్త పరీక్ష (రక్తంలోని తెల్లరక్త కణాల శాతం, సీరం, కాల్షియం, రీనల్‌ ఫంక్షన్‌లకు పరీక్షించడం)
3. ఎక్స్‌రే కేవీబీ, అల్ర్టాసౌండ్‌, సి.టి.స్కాన్‌, సిస్టోస్కోపి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.


తీసుకోవలసిన జాగ్రత్తలు
రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు ఐదు గ్రాములు, మాంసకృతులు 170 నుంచి 230 గ్రాములు మించకుండా చూసుకోవాలి. విటమిన్‌ సి, కాల్సియం సప్లిమెంట్లు ముఖ్యంగా మాత్రలు వైద్యులు సూచనమేరకే తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో 1,000నుంచి 1,200 మిల్లీగ్రాముల కాల్షియం ఉండేట ట్లుగా చూసుకోవాలి. శీతల పానీయాలు తాగడం మానేయాలి. 

తక్కువ క్యాలరీల ఆహారం ఇలా చేయండి


మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా తక్కువ కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాన్ని తయారుచేసుకునేందుకు న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే...

 స్మార్ట్‌ కుకింగ్‌ అలవాటు చేసుకోవాలి. మీ ఆహారాన్ని గ్రిల్‌ చేయటం, ఉడకబెట్టడం, బేక్‌ చేయటం చాలా మంచిది. నాన్‌స్టిక్‌ తవా, పాన్‌లో ఆహారాన్ని తయారు చేసుకోండి. అలాంటి ఆహారం తినటం వల్ల తక్కువ క్యాలరీలతో పాటు ఆరోగ్యం కూడా. 

 కాలీఫ్లవర్‌, మిరియాలు, తోటకూరలు, బీరకాయల్లాంటి పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇవన్నీ లో క్యాలరీ పదార్థాలు.

 ప్రొటీన్‌ ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తిగా ఉంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, చికెన్‌, సోయా లాంటివి తింటే బావుంటుంది.

 జొన్నలు, రాగులు, గోధుమలతో చేసిన రొట్టెలు తినాలి, ఓట్స్‌, బార్లీ, డ్రై ఫ్రూట్స్‌, అవిసె గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.

 వంటనూనెల్ని నెలకోసారి మారుస్తుండాలి. రైస్‌బ్రాన్‌, ఆవ నూనెల్ని వాడుతుండాలి.

 పళ్లు, కూరగాయల ముక్కలు ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. అన్నం, కూర దాదాపుగా సరిసమానంగా ఉండాలి. అంటే కూర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.

 స్నాక్స్‌ టైంలో నూనెతో తయారైన సమోసాలు, బజ్జీల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.

 టీలు, కాఫీలు తాగే రోజులో ఒకటి రెండుసార్లకంటే ఎక్కువగా తాగకూడదు.కమలా పండే బెటర్‌


ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే కమలాపండు జ్యూసు చేసే మేలు ఏదీ చేయదంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ రసంలోని యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీని పరిశీలించిన అధ్యయనకారులు అందులో యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీ బాగా ఉండడాన్ని వెల్లడించారు. ఈ స్టడీని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా శాస్త్రవేత్తలు చేశారు. పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండడానికి ఇందులోని యాంటాక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. గ్రెనడా యూనివర్సిటీకి చెందిన జోస్‌ యాంజిల్‌ రఫ్లాన్‌ హెన్‌రెస్‌ బృందం ‘గ్లోబల్‌ యాంటాక్సిడెంట్‌ రెస్పాన్స్‌’ అనే టెక్నిక్‌ని కనుగొన్నారు. ఇందులో గాసో్ట్రఇంటస్టైనల్‌ డైజిషన్‌కు సంబంధించిన ఇన్‌ విట్రో సిమ్యులేషన్‌ కూడా ఉంది. దీన్నిబట్టి కమలాపండు జ్యూసులో ఉన్న యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీ తొలుత ఊహించినదాని కన్నా కూడా పది రెట్లు ఎక్కువ ఉందని తేలింది. కమలాపండే కాదు అన్ని రకాల జ్యూసుల్లో, ఫుడ్స్‌లో ఉండే యాంటాక్సిడెంట్‌ విలువను ఈ పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు. డైటీషియన్స్‌ కూడా తమ దగ్గరకు వచ్చేవారికి వారు తీసుకునే ఆహారంలో యాంటాక్సిడెంట్స్‌ విలువలు ఎంత ఉన్నాయో ఈ టెక్నిక్‌ సహాయంతో నిర్థారించి చెప్పవచ్చు. ఈ లక్షణాలు ఉంటే.. థైరాయిడ్‌ కావచ్చు


తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం... ఇలాంటి లక్షణాలు రోజూ ఉంటున్నాయా? పని ఒత్తిడి మూలంగా ఇవన్నీ వస్తున్నాయని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఒకవేళ మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? చెక్‌ చేసుకోండి.

నీరసం : పని చేయకపోయినా రోజూ మధ్యాహ్నం వేళ నీరసంగా ఉంటోందా? అయితే అనుమానించాల్సిందే. థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం. 

జీర్ణసమస్యలు : డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్‌లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది.

బరువులో తేడా : థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియలను నియంత్రిస్తుంది. బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే హైపోథైరాయిడిజంగా భావించాలి. మెటబాలిజం లెవెల్స్‌ పెరగడం, తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.

శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్‌, క్యాబేజి వంటి ఆహారపదార్థాలు థైరాయిడ్‌ పనితీరును తగ్గిస్తాయి. ఈసారి మీరు ఇవి తిన్నప్పుడు శ్వాస సమస్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్‌ చేయించుకోండి.

డిప్రెషన్‌ : శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపై కూడా హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మూడ్‌ బాగా లేదని అంటున్నారంటే థైరాయిడ్‌ గురించి ఆలోచించాల్సిందే.

గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంధి పెరగటాన్ని గాయిటర్‌ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్‌ గ్రంధి బాగా పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.

హార్ట్‌రేట్‌ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్‌బీట్‌ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్‌ సమస్య ఉందేమో చెక్‌ చేసుకోవాలి.

ఆకలి లేకపోవడం : థైరాయిడ్‌ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం. బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే థైరాయిడ్‌ చెకప్‌ చేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవడం ఉత్తమం.





అధిక రక్తపోటు.. దంతాలకూ సమస్యే..!


బరువు పెరిగినకొద్దీ గుండెకి ఎక్కువ దూరం రక్తనాళాలలో రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. అందుకని గుండె గట్టిగా మూసుకుని తెరుచుకోవాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. గుండె గదులు పెద్దవవుతాయి. గదుల్లోని రక్తం పూర్తిగా పంప్ కాక మిగిలిపోతుంటుంది. శరీరంలోనే కాదు, రక్తంలోనూ కొవ్వు పెరుగుతుంది. రక్తనాళాల, గుండె జబ్బులొస్తాయి. అధిక రక్తపోటుతోపాటు అధిక బరువువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావం పళ్లమీదా పడుతుంది. అందుకని దంతవైద్యం కోసం వెళ్లినపుడు అధిక రక్తపోటుంటే చెప్పాలి.
అధిక రక్తపోటున్నవాళ్లకి దంత, చిగుళ్ల శస్త్ర చికిత్సలలో రక్తస్రావం ఎక్కువవుతుంది. అందుకని ముందే తెలుసుకుంటే జాగ్రత్తపడవచ్చు.
నోట్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికే కాదు, క్రిముల్ని నాశనం చేయడానికి లాలాజలం తోడ్పడుతుంటుంది. అధిక రక్తపోటువల్ల నోరెండిపోతున్నట్లుంటుంది. దాంతో చిగుళ్ల వ్యాధులూ వస్తాయి. అందుకని రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే అధిక బరువుని తగ్గించుకోవాలి.
శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రక్తంలోనూ కొవ్వు పెరుగుతుందనుకున్నాం! దాంతో ఎథిరోస్క్లీరోసిస్ వచ్చి రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం రావచ్చు. ముఖ్యంగా దంతాల చిగుళ్లకి రక్తం సరఫరా చేసే నాళాలలో అడ్డంకులవల్ల చిగుళ్ల జబ్బులు రావచ్చు. అధిక రక్తపోటుకి వాడే మందులవల్ల నోటికి రుచి తెలియదు. దానినే ‘డిస్‌గేసియా’ అంటారు. అంటే మందుల ప్రభావం నోటి మీదుంటుందనేగా.
దంతవైద్యుడి దగ్గరకు వచ్చే ప్రతి విజిట్‌లోను రక్తపోటు చూసుకుంటుండాలి. రక్తపోటుని బట్టి దంత చికిత్సని వైద్యుడు ప్లాన్ చేస్తాడు. పొడిగించి చేసినా ఫరవాలేదనుకున్న చికిత్సల్ని తర్వాత చేస్తాడు. ఏ మందులు వేసి తగ్గించాలో కూడా వైద్యుడే నిర్ణయిస్తాడు.
ఈ ఇబ్బందులన్నీ పడి దంత చికిత్స చేయించుకునే బదులు బరువుని అదుపులో ఉంచుకోవడం మంచిది! కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడంవల్ల అన్ని అవయవాలు అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తపడవచ్చు. అన్ని చికిత్సలకి అందుబాటులో ఉండవచ్చు. బరువు పెరగడం ఆరోగ్యానికి భారం.. అనారోగ్యానికి ఆలవాలం.

 

కాలేయ దానం ఎవరైనా చేయొచ్చు..

య్యలేక ఈ అవయవాల్ని తీసేసి, వేరే అవయవాల్ని పెట్టక తప్పదు. మరి అప్పుడు అవయవాలు కావాలి, అవయవాలు లేకపోతే ‘మార్పిడి’ అనే మాటకి అర్థమే లేదు.
ఇప్పుడు ఏ అవయవం కోసమైనా ఎదురుచూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే, దాతల సంఖ్య చాలా తక్కువ. ఇది బాధపడాల్సిన పరిస్థితి. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కలిగే స్థితి.
ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయితే అతని అవయవాలతో దాదాపు 9 మంది కొత్త జీవితాన్ని పొందుతారు. రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, గుండె, ఫాంక్రియాస్, లివర్‌లని దానం చేయవచ్చు. ఒక్కో అవయవం ఒక్కరికి అమరుస్తారు కాబట్టి 9 మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు.
ఇక్కడ మరో టెక్నికల్ విషయం గురించి ఆలోచించాలి. గుండె తీసిన 4 గంటలలోపే అమర్చి, కొట్టుకునేట్టు చెయ్యాలి. అలాగే కాలేయం 8 గంటల లోపు, కిడ్నీలు 24 గంటలలోపు.. ఇలా ఒక్కో అవయవాన్ని అమర్చేందుకు కచ్చితమైన కాలవ్యవధి ఉంది. అందుకని అవయవాలు దొరుకుతున్నాయంటే వాటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలో, ప్రాణాపాయం ఉన్నవాళ్ళని ముందు సిద్ధం చేస్తారు.
గుండె కొట్టుకుంటుంటే, రక్తప్రసరణ జరుగుతుండడంతో అన్ని అవయవాల్ని తీసుకోవచ్చు. అన్ని అవయవాల్ని తీసేసిన తర్వాత ఆఖరుకి గుండెని తీస్తారు. కానీ అమర్చేటపుడు గుండెని ముందు అమర్చాలి. కాలేయాన్ని సమయం మించకుండా అమర్చాలి.
ఇలా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానం చేస్తే ‘కెడావరిక్ డొనేషన్’ అంటారు. అలా కాకుండా బతికున్న వాళ్ళనుంచి కొన్ని అవయవాలు లేక అవయవ భాగాలు తీసుకోవచ్చు. దానిని ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు. అంటే బ్రతికున్నవాళ్ళనుంచి దానం జరుగుతుందన్నమాట. రెండు కిడ్నీలుంటే ఒక కిడ్నీ దానం చేయవచ్చు. కానీ ఒక లివర్ వున్నా దాంట్లో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. లివర్ రెండేసి రెండేసి ఉన్న ఎనిమిది భాగాలు, ఎనిమిది భాగాలకి రక్తప్రసరణ వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో ఫ్లోర్‌లో రెండేసి ఫ్లాట్లున్న నాలుగంతస్థుల భవనం లాంటిది లివర్. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి డ్రైనేజ్, తాగు, వాడుక నీరు సరఫరా వేరుగా ఉంటుంది. అలాగే లివర్ కూడా. లివర్‌లో 1/3 వంతు ఉన్నా లివర్ చేసే పనులన్నీ చేయగలదు. పైన 4 లోబులని దానం చేస్తే అవతలి మనిషి బ్రతుకుతాడు. రెండు నెలల్లో ఇద్దరి లివర్లు పూర్తి స్థాయికి పెరుగుతాయి. చనిపోయేంతవరకు పెరిగే అవయవం లివర్ ఒక్కటే. లివర్ పెద్ద రసాయన కర్మాగారం. ఆ రసాయనాల్ని బయట తయారుచేయాలంటే ఫ్యాక్టరీని కొన్ని ఎకరాలలో పెట్టాలి. రక్తాన్ని శుద్ధిలో ఉంచే అవయవం- లివర్. అటువంటి లివర్ దెబ్బతింటే వేరేది పెట్టుకోవడం తప్పదు! ఇలా బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర్నుంచి లివర్ స్వీకరించడం ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు.
‘కెడావరిక్ డొనేషన్స్’ సంఖ్య పెరిగితే, ‘లివింగ్ డోనర్ డొనేషన్స్’ తగ్గు తాయి. లివింగ్ డోనర్ డొనేషన్స్‌లో ఇద్దరికి, రెండు శస్త్ర చికిత్సలు జరగాలి. కెడావరిక్ డొనేషన్ అయితే జరిగేది ఒక్కటే శస్తచ్రికిత్స. రెండో వ్యక్తికి రిస్క్ ఉండదు.
ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎంతోమంది డాక్టర్లు ‘కాలేయ మార్పిడి’ని విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి శస్తచ్రికిత్సల కోసం హైదరాబాద్ దాటి వెళ్ళనక్కరలేదు.
ఒకప్పుడు ఇలాంటి పెద్ద శస్తచ్రికిత్సలకి విదేశాలకి వెళ్ళేవారు. ఇప్పుడు విదేశాలవాళ్ళు, ఈ పెద్ద కొత్త శస్తచ్రికిత్సలకోసం మన దేశానికి వస్తున్నారు. ఇది ‘రివర్స్ ట్రెండ్’. ఇక్కడ తక్కువ ఖరీదుతో చికిత్స జరుగుతుందని, అక్కడ చేసేది ఇక్కడివాళ్ళే, ఇప్పుడు వెనక్కి వచ్చేశారని, వాళ్ళ సామర్థ్యం, పెరిగిన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో చికిత్సలు జరుగుతున్నాయని తెలిసి ఇక్కడికి జనం వస్తున్నారు. మెడికల్ టూరిజం పెరుగుతోంది. ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుంటేనే అవయవ దానంపై తగిన అవగాహన ఏర్పడుతుంది.

నలుపుదనం.. పిప్పి పన్నుకు సంకేతం


మనం ప్రతిరోజూ ముఖం నోరు, దంతాలు, నాలుక శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దైనందిన జీవితంలో మామూలుగా భావించి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల పళ్ళు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడతాయి. అసలు నోటిని పరీక్షగా చూసుకునే అలవాటు చాలామందికి ఉండదు. కాని అద్దంలో నోటిని పరీక్షించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. పంటిమీద నల్లని మచ్చ ఏర్పడిందంటే పన్ను పుచ్చిపోవడానికి ప్రారంభదశలో ఉన్నదని గ్రహించాలి. ఆ తరువాత నల్లని మచ్చ రంధ్రంగా ఏర్పడుతుంది. పన్నుకు రంధ్రం పడితే మనకు ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే మనం చిన్న ఆహార పదార్థాలు ఆ పంటి రంధ్రంలో ఇరుక్కుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పిగా కూడా ఉంటుంది. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు మొదలైన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిలో వైద్య సహాయం పొందినట్లయితే, అంటే దంత వైద్యుని దగ్గరకు వెళ్లినట్లయితే ఆ పుచ్చిన పంటికి జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపుతాడు. కాని ఏ విధమైన చికిత్స పొందనట్లయితే ఆ పన్ను బాగా పుచ్చిపోయి పంటిలో ఉన్న జీవనాడులు, రక్తనాళాలు బయటపడిపోయి బాక్టీరియా ప్రవేశించి, పంటిని నాశనం చేస్తుంది. ఈ పరిస్థితిలో కూడా విపరీతమైన నొప్పి కలుగుతుంది.
పంటినొప్పికి పెయిన్‌బామ్ వాడవచ్చా?
చాలామంది పంటినొప్పి వచ్చిందంటే ఏదో ఒక నొప్పిని తగ్గించే బామ్‌ని వాడతారు. వేడినీటితో లేక వేడి ఉప్పుతో కాపడం చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల పంటి దగ్గర దవడ ఎముక బాగా కమిలిపోయి ఇంకా ఎక్కువ నొప్పి రావడం జరుగుతుంది. తరువాత దవడ వాపు వచ్చి విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా పెయిన్‌బామ్‌ను వాడకూడదు. అలా వాడడంవల్ల దవడ భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీము తీసివేయడానికి దవడ దగ్గర రంధ్రం చేసి చీమును తొలగించాలి. లేకుంటే ఆ చీము గొంతులోని మాగ్జిలరీ సైనస్‌లోకిపోయి ఎంకా ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. కనుక పరిస్థితి విషమించకుండా చీముని తీసివేయవలసి ఉంటుంది.
అదేవిధంగా బాగా పుచ్చిపోయిన పంటి రూట్‌లో క్రిందగా దవడ ఎముక భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీమును తీసివేయకుంటే దవడ బాగా వాచి అక్కడ చీము పేరుకుపోయి ఉంటుంది. దీనిని డెంటల్ ఏబ్బిస్ అంటారు. ఈ దశలో కూడా మనకు చాలా నొప్పి కలుగుతుంది. ఈ దవడ మీద ఉన్న చీమును తీసివేస్తే కాని వాపు తగ్గదు. కనుక దవడకు రంధ్రం చేసినట్లయితే చీమంతా బయటకు పోతుంది. ఆ తరువాత ఆ భాగంలో ఒక మచ్చ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా దంతవైద్యుడిని సంప్రదించినట్లయితే పన్ను పీకవలసిన పనిలేదు. ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసి చికిత్స చేసి పంటిని కాపాడుకోవచ్చు.
పన్ను తీసివేస్తే కన్ను పోతుందా?
పన్ను పీకించుకోవడంవల్ల ఏ విధమైన ప్రమాదం లేదు. చాలామంది పన్ను పీకించుకుంటే కంటిచూపు తగ్గడం, కొంతమంది కళ్లు పోతాయి అనే మూఢ నమ్మకాలు ఉన్నాయి. కాని పన్నుకు కన్నుకు ఎటువంటి సంబంధం లేదు. పన్ను పీకించుకోవడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోను కంటికి ఎలాంటి హాని జరగదు.
పుచ్చిన పంటిలో పురుగులుంటాయా?
పళ్లను మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల బాక్టీరియా అంటే రోగపూరిత సూక్ష్మజీవులు ఇవి మన కంటికి కనిపించవు. బాక్టీరియాను మైక్రోస్కోప్‌తోనే చూడవలసి ఉంటుంది. కనుక పంటిలో ఏ విధమైన పురుగులు, కీటకాలు ఉండవు. కొంతమంది మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి పురుగు తీయించుకోవడం చేస్తారు. కొంతమంది చెవిలో పసర్లు వేసి నోటిలోనుండి పురుగులు పడడం, మరి కొంతమంది నోటిలో పసరు వేసి పుక్కిలించడంవల్ల పుచ్చిన పంటిలో ఉన్న పురుగులు పడిపోయి, ఆ తరవాత పంటి నొప్పి ఉండదు అని చెబుతుంటారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలే తప్ప మరేమీ కాదు.

కొవ్వు తగ్గితే గుండెకు హాయ..

గుండెపోటు ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ. లేకపోతే గుండెపోటు రావొచ్చు.
మన దేశంలో మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు కారణానే జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో వాళ్లకన్నా పది సంవత్సరాల ముందే మన దేశంలో గుండెపోటులొస్తున్నాయి.
హార్ట్ ఎటాక్ వస్తే ఏం జరుగుతుంది?

గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని శరీరంలోని భాగాలన్నింటికి చేరేలా పంప్ చేస్తుంది. రక్తప్రసరణకి ముఖ్య రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని ప్రాంతాలకి వెళ్తుంటే, వాటినుంచి శాఖోపశాఖలు చీలి శరీరంలోని అన్ని అవయవాలకూ చేరుతుంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కో నాళం ద్వారా రక్తసరఫరా జరుగుతూంటుంది. గుండె కరోనరి, ఆర్టెరి మూడు శాఖలుగా చీలి రక్త సరఫరా జరిగేలా చూస్తుంటుంది. ఏ భాగాలకు రక్తసరఫరా తగ్గినా ఆక్సిజన్ ఆహారం సరిగా లభ్యంకాక బాధపడుతుంటారు. గుండెకి రక్తసరఫరా తగ్గినా అంతే! గుండె చాలా ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ‘లబ్ - డబ్’ అని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు ప్రసరింపజేసి, కార్బన్‌డయాక్సైడ్‌తో కూడిన రక్తాన్ని వెనక్కి తెచ్చుకుని ఊపిరితిత్తులలోకి పంపి, కార్బన్‌డయాక్సైడ్‌ని బయటకు పంపి, ఆక్సిజన్‌ని రక్తం ద్వారా తీసుకుని మళ్లీ అన్ని అవయవాలకు పంపుతుంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాలలో గోడలమీద పేరుకుపోవడం జరుగుతుంది. అలా పేరుకుంటున్న కొలెస్ట్రాల్ పదార్థం రక్తనాళాలలో రక్తం ప్రవహించే మార్గాల్ని మూసేస్తూంటుంది. దాంతో గుండెకి కావలసిన రక్తం అందక హార్ట్‌ఎటాక్ వస్తుంది. కాలం గడిచినకొద్ది ఆహారం, ఆక్సిజన్ అందక రక్తప్రసరణ లోపించడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
కొద్ది కొద్దిగా గుండె రక్తనాళాలు మూసుకుపోవడం ప్రారంభమైనపుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. వాటిని ఎంజైనా అంటారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. ఆయాసపడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటుంది. గుండె ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులలోకి వెళ్తుండవచ్చు. దవడలోకి వెళ్లవచ్చు. కిందకు రావచ్చు. కాబట్టి బొడ్డు నుంచి దవడల వరకూ రకరకాలుగా మిమిక్ చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో నొప్పి ఉంటే వెంటనే గుండె వైద్యుణ్ణి కలిసి ఇసిజి తీయించాలి. అది గుండె నొప్పయితే ఈ చిన్న పరీక్షలో తెలిసిపోతుంది. గుండె నొప్పయితే గుండె చికిత్సా నిపుణులతో అత్యవసరంగా చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ఛాతీ మధ్యభాగంలో మంట వస్తే ఎసిడిటి తాలూకు నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది!
లక్షణాలు
గుండెపోటు చాలా సార్లు ఛాతిలో చిన్న నొప్పిగా ప్రారంభమై- అడ్డంకులు పెరిగేకొద్దీ- పెరుగుతుంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. అందుకని ఛాతిలో నొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఈ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం తీసుకువస్తుంది. చాలాసార్లు మనమింతకు చెప్పుకున్నట్లు ఎసిడిటి అనో, అజీర్ణమనో భావించి వైద్యుణ్ణి కలవకుండా ఉండడంతో హఠాత్తుగా రోగి నొప్పితో తన్నుకునే పరిస్థితి వస్తుంది.
చికిత్స
హార్ట్ ఎటాక్ తీవ్రంగా వచ్చినపుడు ప్రతి నిమిషం విలువైనది! ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత వేగంగా గుండె కండరాలు దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ప్రాణాన్ని కాపాడవచ్చు, గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తిని పునరుద్ధరించి! దాంతో వేగంగా కోలుకుంటారు.
చికిత్సని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాలి. ముఖ్యంగా లక్షణాలు కనిపించిన రెండు గంటలలోపు. గుండెపోటు వచ్చిందని తెలిసింతర్వాత అయిదు నిముషాలు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇ.సి.జి తీసి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకుంటారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి, వాటిని తొలగించాలి. ఒకప్పుడు యాంజియోప్లాస్టి అంటే శస్త్ర చికిత్స కాదు, ప్రొసీజర్. గతంలో తొడద్వారా కేథటార్‌ని పంపి అడ్డంకుల్ని తొలగించేవారు. రక్తస్రావం ఎక్కువగా ఉండేది. కదలకుండా ఒక రోజు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు చేతి రేడియల్ ఆర్టీ ద్వారా యాంజియో చేస్తున్నారు. పొద్దున చేయించుకుని, విశ్రాంతి తీసుకుని రాత్రికి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. చేతి ద్వారా చేయటంవల్ల చాలా తేలికగా పొసీజర్ జరుగుతుంది. దీనిని ‘రేడియల్ యాంజియో’ అంటారు.
రేడియల్ యాంజియో ద్వారా ఇప్పుడు అతి క్లిష్టమైన అడ్డంకుల్ని తొలగిస్తున్నారు. గట్టిగా అయిపోయిన వాటిని ఆర్టరీ చీలే చోట ఉన్న అడ్డంకుల్ని గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టెరీలో బ్లాక్‌లు వున్న యాంజియోప్లాస్టీతో తొలగిస్తున్నారు. కేథటార్‌ని లోపలకు పంపి ఇంజెక్షన్‌నిచ్చి అడ్డంకుల్ని తెలుసుకోవడాన్ని ‘యాంజియోగ్రామ్’ అంటారు. కేథటార్ ద్వారా అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని ‘యాంజియోప్లాస్టీ’ అంటారు. అడ్డంకుల్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా స్టంట్‌లని అమరుస్తారు. అనుభవమున్న గుండె చికిత్సా నిపుణులతోనే యాంజియోప్లాస్టి, స్టంటింగ్ చేయించుకోవాలి.


















No comments:

Post a Comment